Hyderabad, ఏప్రిల్ 1 -- జీవితంలో ముందుకు సాగాలంటే మోటివేషన్ చాలా అవసరం. ముఖ్యంగా మీరు ఏ పనిలోనైనా విఫలమైనప్పుడు చాలా నిరాశ పడిపోతారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం చీకటిగా మారిపోతుంది. ప్రతి ఉదయం మీకు మీరే ఉత్సాహాన్ని నింపుకోవాలి. మీరే కాదు మీ స్నేహితులకు, కుటుంబసభ్యులు నిరాశగా ఉన్నప్పుడు వారిలో మోటివేషన్ నింపేందుకు ఈ కోట్స్ ఉపయోగపడతాయి.

1. జీవితంలో విజయం సాధించాలంటే కష్టాన్ని నమ్ముకోవాలి

అదృష్టాన్ని నమ్ముకుంటే జూదం ఆడటంతో సమానం

2. నొప్పి, దుఃఖం, భయం అన్నీ నీలోనే ఉన్నాయి,

నీవు తయారుచేసుకున్న పంజరం నుండి బయటకు వచ్చి చూడు,

నువ్వు కూడా ఒక పెద్ద మహారాజువి

3. కాలం గడుస్తూనే ఉంటుంది

ఆ కాలంలో మంచి జరిగితే కృతజ్ఞతలు చెప్పండి

చెడుగా ఉంటే ఓపిక పట్టండి

మీకంటూ ఒక రోజు వస్తుంది

4. చదువు మాత్రమే నిన్ను విజయవంతం చేయదు,

అంకితభావం, కష్టపడటం, సరైన దిశల...