Hyderabad, మార్చి 4 -- సన్యాసులు రోజంతా ధ్యానంలోనే ఉంటారు. ఆకలి వేసినప్పుడే భిక్షకు వెళతారు. అలా ఒక సన్యాసి తన శిష్యులతో కలిసి భిక్షకు వెళ్ళాడు. వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ప్రతి ఇంటి దగ్గర ఆగుతూ భిక్ష అడుగుతున్నాడు.

మొదటి ఇంట్లో ఇల్లాలు ఏమీ లేవు, వెళ్ళమని చెప్పింది. ఇక రెండో ఇంటికి వెళితే ఆమె ఒక అరటిపండును వేసింది. ఆ అరటిపండు కూడా సగం పాడై ఉంది. ఇక మూడో ఇంటికి వెళ్తే ఆమె గుప్పెడు బియ్యం పోసింది. నాలుగో ఇంటికి వెళితే ఆ ఇంటి ఇల్లాలు కోపంతో అంత ఎత్తున లేచి నానా తిట్లు తిట్టింది.

ఇక ఐదో ఇంటికి వెళ్లారు సన్యాసులు. ఆ ఇంట్లోనే మహిళ రెండు గ్లాసుల బియ్యాన్ని వేసి వెళ్ళింది. ఇక ఆరో ఇంటికి వెళితే అక్కడున్న ఆమె కోపంతో ఊగిపోయింది. 'ఉత్తినే బియ్యం ఎవరు పోస్తారు, మేము కష్టపడి బతుకుతుంటే మీకు ఊరికే ఇవ్వాలా' అంటూ తిట్టడం మొదలు పెట్టింది. సన్యాసులంతా చిరున...