Hyderabad, మార్చి 11 -- డబ్బుకున్న విలువ ప్రేమలకు, ఆప్యాయతలకు ఉండడం లేదు. మీకు ఎంత సంపద ఉన్నా అది మనుషులతో ఎప్పటికీ సమానం కాదు. ఎన్ని కార్లు ఉన్నా, ఎంత పెద్ద విలాసవంతమైన ఇల్లు ఉన్నా, మిమ్మల్ని ప్రేమించే వారు మీ చుట్టూ లేకపోతే ఆస్తి, హోదా అన్నీ ఉన్నా లేనట్టే. ఆస్తి సంపాదించడం కన్నా జీవితంలో అనుబంధాలు నిలుపుకోవడమే చాలా కష్టం. బంధాల విలువను ఒంటరిగా పెరిగిన అనాథను అడగండి తెలుస్తుంది. ఎవరూ లేక ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తులను అడిగి చూడండి ఆప్యాయత విలువ ఏంటో.

బంధాలు తెగిపోయినా పెరుగుతున్న సంపదను చూసి ఆనందపడతారు ఎంతో మంది. నలుగురితో కలిసి జీవిస్తే మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఒంటరిగా ఇంద్రభవనంలో ఉన్నా మిమ్మల్ని మెచ్చుకునేవాళ్లు, మీకు గ్లాసు నీళ్లు తెచ్చి ఇచ్చే వాళ్లు ఎవరూ ఉండరు. జీవితంలో శూన్యమే మిగులుతుంది. జీవితంలో అన్ని బంధాలను నిలుపుకునేంద...