Hyderabad, మార్చి 24 -- క్షయ లేదా టీబీ వ్యాధి తీవ్రమైనది. కానీ దీని లక్షణాల గురించి మాత్రం చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. దీని లక్షణాలు సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారిపోతుంది. అందుకే ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. టీబీ సోకితే కనిపించే లక్షణాల గురించి ఇక్కడ ఇచ్చాము. ఇవి మీలో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మర్చిపోవద్దు.

క్షయ వ్యాధి కొందరిలో చురుకుగా ఉంటుంది, మరికొందరిలో క్రియా రహితంగా ఉంటుంది. క్రియారహితంగా టీబీ ఉన్న వారిలో లక్షణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎలంటి బాహ్య లక్షణాలు కనిపించవు. అయినప్పటికీ స్క్రీనింగ్ పరీక్షలో క్షయ వ్యాధి బయపడుతుంది. ఇక టిబి కొందరిలో చురు...