భారతదేశం, ఏప్రిల్ 14 -- TTD on Cow Deaths: టీటీడీ గోశాలలో గోవుల మృతిపై వివాదం కొనసాగుతోంది. గత వారం గోశాలలో 100గోవులు మృతి చెందామయని ఆరోపించడంతో కలకలం రేగింది. దీనిని టీటీడీ ఛైర్మన్ అధికారులు ఖండించారు. దీంతో తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని భూమన ప్రకటించారు. దీంతో టీటీడీ ఈవో సోమవారం వివరణ ఇచ్చారు.

మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు గోశాలలో చాలా అక్రమాలు జరిగాయని, ముఖ‌్యమంత్రి ఆదేశాలతో వాటిని సరిచేస్తున్నామని చెప్పారు. 2024 ఏడాది నాటికి 179 గోవులు మరణించగా, 2025 ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో 43 గోవులు మృతి చెందాయని ఈవో తెలిపారు. చనిపోయిన గోవులు వయోభారం, వ్యాధుల కారణంగా సహజ మరణాలేనన్నారు.

ఈ సంవత్సరం ఇప్పటి వరకు 59 లేగ దూడలు జన్మించాయని, టిటిడి బోర్డు మాజీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, గోవుల దాణాను విస్మరించినట్లు...