భారతదేశం, ఫిబ్రవరి 21 -- TTD Issue : టీటీడీ ఉద్యోగిని బోర్డు సభ్యుడు దూషించిన వ్యవహారం ముదురుతోంది. పాలకమండలి, టీటీడీ ఉద్యోగుల మధ్య వివాదంగా మారుతోంది. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం గేటు వద్ద కర్ణాటకకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‍ కుమార్‍ ఉద్యోగి బాలాజీని దూషించడంపై టీటీడీ ఉద్యోగులు రెండో రోజు మౌనదీక్ష చేశారు. టీటీడీ పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మౌనదీక్షకు చేశారు.

ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, ఆయనను పదవి నుంచి తొలగించాలని ఉద్యోగులు డిమాండ్‍ చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, విజిలెన్స్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారని ఉద్యోగ సంఘం నాయకులు అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకుంటే భవిష్...