భారతదేశం, ఫిబ్రవరి 10 -- TTD Ghee Issue: తిరుమలలో లడ్డూ తయారీల కోసం వినియోగించే నెయ్యిలో కల్తీకి పాల్పడిన ఘటనలో నలుగురిని సిట్ అరెస్ట్‌ చేసింది. గత ఏడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. సీబీఐ జేడీ పర్యవేక్షణలో సిట్‌ కొద్దినెలలుగా దర్యాప్తు చేస్తోంది. ఆదివారం లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ వ్యవహారంలో 4గురిని సీబీఐ దర్యాప్తు బృందం అరెస్ట్‌ చేసింది.

భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ(పూనంబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఎఆర్ డైరీ(దుండిగల్) ఎండి రాజు రాజశేఖరన్ లను అరెస్టు చేశారు.

క్రైం నెంబర్ 470/24లో అరెస్టు చేసి నిందితులను తిరుపతి కోర్టులో హాజరు పరిచారు. ఎఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణ...