భారతదేశం, జనవరి 29 -- TTD Filed Complaint : ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో టీటీడీ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులపై కేసు నమోదైంది.

చాగంటి కోటేశ్వరరావు తిరుమల పర్యటనపై వాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా టీటీడీ వెల్లడించినా, ఈ సోషల్ మీడియా ప్రతినిధులు...డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ పదే పదే టీటీడీ ప్రతిష్టను దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి అవాస్తవాలను ప్రచారం చేశారని టీటీడీ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పీఎస్ లో కేసు నమోదు చేయడంతో పాటు న్యూఢిల్లీ, విజయవాడలోని పీఐబీ (ప్రె...