భారతదేశం, ఏప్రిల్ 11 -- తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో మహాపాతకం జరుగుతోందని.. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతామని.. తిరుమల పవిత్రత కాపాడటమే ధ్యేయం అని చంద్రబాబు, పవన్ చెప్పారన్నారు. కానీ గత మూడు మాసాలుగా గోశాలలో 100కుపైగా గోమాతలు మృత్యువాత పడుతుంటే.. ఆ విషయాన్ని దాచిపెట్టారని విమర్శించారు.

1.పవిత్ర పుణ్యక్షేతంలో టీటీడీ నడిపే గోశాలలో గోవుల దుస్థితి చూడండి. గోవులు ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియదు. టీటీడీ అధికారులు పర్యవేక్షణే లేదు. రాష్ట్ర అధినేతలకు ఊడిగం చేయడానికే కొందరు టీటీడీ అధికారులకు సమయం సరిపోతోంది.

2.శ్రీవేంకటేశ్వరునికే ఆహారాన్ని అందించిన తల్లి గోమాత. అలాంటి గోవు పట్లే ఈ ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. స్వామి సుప్రభాత స...