భారతదేశం, జనవరి 31 -- తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భేటీ అనతరం బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. రథసప్తమికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏడు వాహనాలపై రథసప్తమి నాడు స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. 2 నుండి‌ 3 లక్షల మంది భక్తులు ఆరోజు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు.

'రద్దీని దృష్టిలో ఉంచుకొని రథసప్తమి నాడు అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నాం. ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుపతిలో ఎస్ఎస్‌డీ టోకన్లు జారీని నిలిపివేస్తున్నాం. 1250 మంది పోలీసులతో రథసప్తమికి భద్రత కల్పిస్తాం. భక్తుల‌ మధ్య తోపులాటకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నాం. ఆక్టోపస్, ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎ...