భారతదేశం, ఫిబ్రవరి 17 -- తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం టికెట్ల దందా మరొకటి బయటకు వచ్చింది. ఈసారి కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై టీటీడీ అలర్ట్ అయ్యింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. తన ఫొటోతో కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, భక్తులు ఇలాంటి వారిని నమ్మొద్దని స్పష్టం చేశారు.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకొని ఓ కేటుగాడు మోసాలకు పాల్పడుతున్నాడు. తిరుమల సమాచారం అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తులు టార్గెట్ చేసుకొని.. మోసాలకు పాల్పడుతున్నాడు. వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టిక్కెట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నాడు. అయితే.. మోసపోయామని తెలుసుకొని.. బాధిత భక్తులు ఛైర్మన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు.

దీనిపై విచారణ జరపాలని బీఆర్ నాయుడు అధికారులను ఆదేశి...