భారతదేశం, ఏప్రిల్ 13 -- TTD Chairman : 'టీటీడీని రాజకీయాల్లోకి లాగొద్దని, కలియుగ దైవం వేంకటేశ్వరుడితో పెట్టుకుంటే ఆయన చూస్తూ ఊరుకోడని' టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్న సమయంలో అనేక అక్రమాలకు జరిగాయని బీఆర్‌నాయుడు ఆరోపించారు. ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. ఆదివారం తిరుపతిలోని ఎస్వీ గోశాలను పరిశీలించిన అనంతరం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. భూమన అతిపెద్ద అవినీతిపరుడని, టీటీడీలో కమీషన్ల ఛైర్మన్‌గా వ్యవహరించారని ధ్వజమెత్తారు.

గత మూడు నెలల్లో 100కి పైగా గోవులు మరణించాయని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణాలతో గోవులు మరణించాయే తప్ప, టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం లేదన్నారు. భూమన కరుణాకర్...