భారతదేశం, ఫిబ్రవరి 19 -- TTD Board Member: విధుల్లో ఉన్న టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు బూతులతో విరుచుకుపడటం కలకలం రేపింది. మహా ద్వారం తలుపులు తీయనందుకు టీటీడీ ఉద్యోగిని బోర్డు సభ్యుడు నరేష్‌ చేత్తో నెట్టేస్తూ బూతులు తిట్టడం వీడియోలలో రికార్డైంది. మంగళవారం టీటీడీ ఉద్యోగిపై ధర్మకర్త మండలి సభ్యుడు నరేష్‌ తిట్లతో విరుచుకుపడ్డారు. దర్శనం పూర్తైన తర్వాత మహాద్వారం నుంచి బయటికి పంపక పోవడంతో నరేష్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. భ క్తులు చూస్తుండగానే ఉద్యోగిపై తిట్ల దండకంతో విరుచుకు పడ్డారు.

టీటీడీ సభ్యుడు నరేష్‌ కుమార్‌ విధుల్లో ఉన్న ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. సభ్యుడు ప్రవర్తించిన తీరుతో అంతా అవాక్కయ్యారు. ఆయన వ్యవహరించిన తీరుతో అక్కడ ఉన్న భక్తులు, ఉద్యోగులు విస్తుబోయారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్...