భారతదేశం, మార్చి 24 -- TTD Board Decisions : 2025- 26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని ఆయన తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో జె.శ్యామ‌ల‌రావుతో కలసి సోమ‌వారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

పోటు కార్మికుల‌కు మ‌రింత మెరుగైన వైద్య స‌హాయంతో పాటు జీతం పెంపుపై ప‌రిశీలించి చ‌ర్యలు తీసుకోవాల‌ని ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈవోను ఆదేశించారు. కొడంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, ఉప‌మాక‌, అన‌కాప‌ల్లె, క‌ర్నూలు, ధ‌ర్మవ‌రం, త‌ల‌కోన‌, తిరుప‌తి గంగమ్మ ఆల‌యాల పునః నిర్మాణానికి ఆర్థిక స‌హాయం అందించేందుకు ఆమోదించామన్నారు. శ్రీ‌వారి అన్నప్రసాదాల‌కు ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన‌ దాత‌ల డొనేష‌న్ పాసు బుక్కుల‌ను ర‌ద్దు చేయా...