తెలంగాణ,విజయవాడ, ఏప్రిల్ 27 -- Hyderabad to Vijayawada TSRTC Buses : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ(TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ(Hyderabad to Vijayawada) రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును అందుబాటులో ఉంచినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతున్నట్లు తెలిపింది. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయని వివరించారు.

ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని సంస్థ కల్పిస్తోందని సజ్జనార్ వెల్లడించారు. తిరుగుప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందన్నారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ ...