భారతదేశం, మార్చి 29 -- TSREIRB Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు హైకోర్టు HIgh court తీపి కబురు చెప్పింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలకు హాజరైన వారిలో మరో రెండు వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.

గురుకుల Gurukula విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం గత ఏడాది ఆగష్టులో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్లు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో పలు ఉద్యోగాలు భర్తీ కాకుండా ఖాళీగా ఉండిపోయాయి. పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వాటిలో మెరుగైన ఉద్యోగంలో చేరిపోయారు. ఇలా ఉద్యోగాల్లో చేరిపోగా వారు వదిలేసిన పోస్టులు దాదాపు రెండు వేల వరకు ఉన్నాయి. వాటిని మెరిట్ జాబితా Merit ...