భారతదేశం, ఏప్రిల్ 30 -- Telangana SSC 2024Results: తెలంగాణ పదో తరగతి SSC Exams పరీక్షల్లో 91.31శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలను Exam Results మంగళవారం విడుదల చేశారు.

తెలంగాణ పదో తరగతిలో 91.31శాతం ఉత్తీర్ణత సాధించారు. BSE Secretary బోర్డు కార్యదర్శి బుర్రా వెంకటేశం, ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ అధికారులతో కలిసి మంగళవారం ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యూయేషన్‌ ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వ హించారు.

ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,05,813మంది విద్యార్ధులు హాజరయ్యారు. వారిలో 4,94,207మంది రెగ్యులర్ విద్యార్ధులు కాగా, మరో 11,606మంది విద్యార్ధులు ప్ర...