భారతదేశం, ఏప్రిల్ 9 -- TS IPS Heart Stroke: తెలంగాణ క్యాడర్‌ సీనియర్ ఐపీఎస్‌ IPS అధికారి రాజీవ్‌ రతన్ Rajiv Ratan గుండెపోటు heart attackతో కన్నుమూశారు. 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌ రతన్‌ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ DG Vigilance డీజీగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం ఛాతీనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఏఐజి ఆస్పత్రికి AIG Hospital తరలించారు.

1991 బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్‌ను ఇటీవల విజిలెన్స్ డీజీ గా నియమించారు. విజిలెన్స్ డీజీగా నియమించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపారు. రాజీవ్ రతన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది.

సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్‌ రతన్‌ గతంలో పలు హోదాల్లో పనిచేశారు. తెలంగాణ పోలీస్‌ హౌసింగ్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గాను విధులు నిర్వర్త...