భారతదేశం, ఏప్రిల్ 22 -- ఇంటర్‌ ఫలితాలను మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఫలితాలను విడుదల చేశారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణాదిత్యలతో కలిసి ఫలితాలను మంత్రి భట్టి విడుదల చేశారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం 56 సర్వర్లను వినియోగిస్తున్నారు. గంటలోనే పదిలక్షల మంది ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు వివరించారు.

తెలంగాణలో మే 22 నుంచి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.

ఆరు దేశాల్లో 57లక్షల జవాబు పత్రాలను అధ్యాపకులు మూల్యాంకనం చేసినట్టు అధికారులు తెలిపారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ప్రక్రియ జనవరిలో ప్రారంభమైంది, 1532కేంద్రాల్లో 9.96లక్షల మంది విద్యార్థులు హాజరైనట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి వివరించారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్య...