భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 ఫలితాలను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ములుగు, మేడ్చల్ జిల్లాలు టాప్‌లో నిలిచాయి. అలాగే కామారెడ్డి మహబూబాబాద్ జిల్లాల్లో తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది.

సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లా విద్యార్థులు 81.06 శాతం ఉత్తీర్ణత సాధించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 80.24 శాతం ఉత్తీర్ణత నమోదైంది. దీంతో ఈ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మేడ్చల్ జిల్లాలో 77.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండో సంవత్సరం ఫలితాల్లో ఈ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇక కామారెడ్డి జిల్లాలో కేవలం 56.38 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో కామారెడ్డి లాస్ట్‌లో ఉంది.

ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో...