భారతదేశం, ఫిబ్రవరి 25 -- TS Inter Hall Tickets 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలకు హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. హాల్ టికెట్లను కాలేజీల లాగిన్‌లలో అప్లోడ్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు తమ సంబంధిత కాలేజీల నుంచి హాల్ టికెట్లను పొందవచ్చు. హాల్ టికెట్లలో ఏమైన తప్పులు, తేడాలు ఉంటే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌, అధికారులను సంప్రదించాలని బోర్డు సూచించింది.

మార్చి 5 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు కలిపి దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. వార్షిక పరీక్షలను సజావుగా న...