భారతదేశం, ఫిబ్రవరి 6 -- రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. 2026- 2027 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ఇస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా నల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.

టీజీ ఐసెట్ - 2026 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 16 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

రూ. 250 ఫైన్ తో మార్చి 30 వరకు, రూ. 500 ఫైన్ తో ఏప్రిల్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 5 వేల ఫైన్ తో మే 1, రూ. 10 వేల ఫైన్ తో మే 2,3 తేదీల్లో అప్లయ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

టీజీ ఐస...