భారతదేశం, మే 3 -- TS Govt Pleader: కోర్టు ప్రాంగణంలోనే మహిళపై అనుచితంగా ప్రవర్తిస్తూ లైంగిక వాంఛ తీర్చాలని వేధిస్తున్న పోకిరి ప్లీడర్‌ ఆగడాలకు షీటీమ్స్‌ అడ్డుకట్ట వేశాయి. న్యాయం వైపు నిలవాల్సిన న్యాయవాది, బాధ్యత మరిచి కోర్టు ప్రాంగణంలోనే మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడి వేధింపులు తట్టుకోలేక బాధితురాలు షీటీమ్స్‌ను ఆశ్రయించింది.

న్యాయస్థానం ఆవరణలోనే మహిళను లైంగికంగా వేధిస్తూ వాంఛ తీర్చాలని వెంటపడుతున్న పోకిరిని హైదరాబాద్‌ షీ టీమ్స్‌ పట్టుకున్నాయి. న్యాయవాదిగా, గతంలో ప్రభుత్వ ప్లీడర్‌గా పనిచేసిన ఏ.సంజయ్‌ కుమార్‌ దారి తప్పి వికృత చేష్టలకు పాల్పడటాన్ని సాక్ష్యాలతో సహా రుజువు చేశారు.

న్యాయవాది, మాజీ ప్రభుత్వ ప్లీడర్‌‌గా విధులు నిర్వర్తించిన సంజయ్ కుమార్‌పై ఇటీవల హైదరాబాద్‌ షీ టీమ్స్‌కు ఫిర్యాదు అందింది. సంజయ్ కుమార్ కుమార్ కోర్టు ఆవరణ...