భారతదేశం, ఏప్రిల్ 29 -- TS EAPCET Hall Tickets : తెలంగాణ ఈఏపీసెట్(TS EAPCET 2024) అగ్రికల్చర్, ఫార్శసీ హాల్ టికెట్లు(Hall Tickets) విడుదలయ్యాయి. ఈఏపీ సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థుల హాల్ టికెట్లను ఉన్నత విద్యామండలి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఇంజినీరింగ్ అభ్యర్థులకు మే 1 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నారు.

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS EAPCET 2024) నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు హాల్ టిక్కెట్లు(TS EAPCET Hall Tickets) లేదా అడ్మిట్ కార్డులను ఇవాళ విడుదల చేసింది. అగ్రికల్టర్, ఫార్మసీ అభ్యర్థులు కౌన్సిల్ అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tsche.ac.in/ నుంచి అడ్మిట్ కార్డులను(Admit Cards) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈఏపీ సెట్ కు ఆలస్య రుసుము ...