భారతదేశం, ఏప్రిల్ 10 -- 90 రోజుల పాటు సుంకాలను ఆపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ముగ్గురు బిలియనీర్లు ఎక్కువ ప్రయోజనం పొందారు. ఎలన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్.. ఒకే రోజు దాదాపు 80 బిలియన్ డాలర్లు సంపాదించారు. ట్రంప్ సుంకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా పెరిగాయి. టెస్లా, అమెజాన్, మెటా వంటి టెక్ కంపెనీల షేర్లు బంపర్ జంప్ చేశాయి.

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఎలన్ మస్క్ సంపద ఒక్కరోజులో రూ.35.9 బిలియన్లు పెరిగింది. మార్క్ జుకర్ బర్గ్ 25.9 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ 18.5 బిలియన్ డాలర్లు సంపాదించారు. ఎలన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఈ ఏడాది ఇప్పటివరకు ఆయన సంపద 107 బిలియన్ డాలర్లు తగ్గింది. జెన్సన్ హువాంగ్ (ఎన్వీడియా సీఈఓ) 15.5...