భారతదేశం, ఏప్రిల్ 10 -- అన్ని దేశాలపై టారిఫ్ వార్ చేస్తున్న ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 90రోజులపాటు సుంకాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. అప్పటిదాకా 10 శాతం మాత్రమే ఉంటుందని తెలిపారు. మరోవైపు అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 125 శాతం వరకు పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్థరాత్రి ప్రకటించారు. అంతకుముందు చైనా అమెరికన్ ఉత్పత్తులపై సుంకాన్ని 84 శాతానికి పెంచడం ద్వారా ప్రతీకార చర్య తీసుకుంది. దీనితో పాటు ట్రంప్ అన్ని ఇతర దేశాలకు 90 రోజుల విరామం ప్రకటించారు.

వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ట్రంప్ ఈ చర్యలు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇది చైనాకు తప్ప ఇతర దేశాలకు మాత్రమే వర్తిస్తుంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైం...