భారతదేశం, ఏప్రిల్ 5 -- Trump tariffs impact: ప్రపంచంలోని అత్యంత సంపన్నులు గత రెండు రోజుల్లో భారీగా నష్టపోయారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ లు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలయ్యాయి. గురువారం (ఏప్రిల్ 3) నుంచి శుక్రవారం వరకు ప్రపంచంలోని 500 మంది సంపన్నులు 53,600 కోట్ల డాలర్ల సంపదను కోల్పోయారని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. వీరిలో అత్యధికులు అమెరికన్లేనని తెలిపింది.

ఎస్ అండ్ పి 500 కేవలం రెండు రోజుల్లో 10.5% పడిపోయింది, నాస్డాక్ 11.4% పతనంతో చాలా వెనుకబడి ఉంది. కోవిడ్ -19 మహమ్మారి ఎఫెక్ట్ తరువాత ఆ స్థాయిలో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడడం ఇప్పుడే. శుక్రవారం ఒక్కరోజే 329 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు 90% మంది బిలియనీర్ల సంపద క్షీణించిందని, సగటున 3.5% కోల్పోయారని బ్లూమ్బెర్గ...