భారతదేశం, ఏప్రిల్ 14 -- ఎఫ్‌పీఐల ఉపసంహరణ, ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ కారణంగా దేశంలోని సంపన్న పారిశ్రామికవేత్తల సంపద ఈ ఏడాది రూ.2.6 లక్షల కోట్లు తగ్గింది. ట్రంప్ టారిఫ్ ప్లాన్ ప్రకటించిన తర్వాత భారీ క్షీణత కనిపించింది. అమెరికా అధ్యక్షుడు గతంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై సుంకాలు విధించారు. దీంతో భారత్ సహా ఇతర దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.

స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ్ నాడార్, సావిత్రి జిందాల్, దిలీప్ సంఘ్వీ, అజీమ్ ప్రేమిల నికర విలువ క్షీణించింది. భారత కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది 3.42 బిలియన్ డాలర్లు తగ్గింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మినహా ఇతర దేశాలపై సుంకాలను నిలిపివేశారు.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. నికర విలువ భారీగా పడిపోవడంతో ముకేశ్ అంబానీ ప్రపంచ...