భారతదేశం, ఫిబ్రవరి 3 -- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇతర దేశాలపై సుంకాల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఇతర దేశాలు దీనిపై స్పందించడం ప్రారంభించాయి. అమెరికా విధించిన సుంకం తర్వాత కెనడా కూడా అమెరికన్ వస్తువులపై సుంకాలను ప్రకటించింది. ఈ మేరకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌లతో ట్రంప్ మాట్లాడారు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవలే కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలను విధిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే దీనిపై రెండు దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమయ్యాయి. అయితే తాజాగా ట్రంప్ వెనక్కు తగ్గారు. మెక్సికన్ వస్తువులపై ఒక నెలపాటు సుంకాలను నిలుపుదల చేసేందుకు ట్రంప్ అంగీకరించారు.

ఇరు దేశాల మధ్య ఒప్...