భారతదేశం, ఏప్రిల్ 3 -- ట్రంప్ సుంకాల ప్రభావం జపాన్, కొరియా మార్కెట్లపై పడినంతగా భారత స్టాక్ మార్కెట్ పై కనిపించడం లేదు. భారీ పతనంతో ప్రారంభమైన సెన్సెక్స్-నిఫ్టీ రికవరీ మోడ్‌లో ఉన్నాయి. ఆటో-ఐటీ షేర్లు కొంత ఒత్తిడికి గురైనా ఫార్మా కంపెనీల షేర్లు మాత్రం పుంజుకుంటున్నాయి.

ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించడంతో ఆసియా మార్కెట్లు గురువారం పతనమయ్యాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 225 సూచీ 3.02 శాతం, టోపిక్స్ సూచీ 3.19 శాతం నష్టపోయాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి సూచీ 1.57 శాతం, కోడెడాక్ సూచీ 0.55 శాతం క్షీణించాయి.

ట్రంప్ భారతదేశంపై 26శాతం ప్రతీకార సుంకాన్ని విధించారు. ఇది అమెరికన్ దిగుమతులపై భారతదేశం విధించిన సుంకం రేటులో సగం. ఇది ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపినప్పటికీ కొన్ని నిమిషాల తర్వాత సెన్సెక్స్-నిఫ్టీ రికవరీ మోడ్‌లోక...