భారతదేశం, ఏప్రిల్ 3 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టుగా ప్రకటించారు. భారత్ పై 26 శాతం సుంకం విధించారు. అమెరికాపై భారత్ 52 శాతం వరకు సుంకం విధిస్తోందని, అందువల్ల భారత్ పై అమెరికా 26 శాతం సుంకం విధిస్తుందని ట్రంప్ చెప్పారు. దిగుమతి చేసుకునే అన్ని ఉత్పత్తులపై 10 శాతం సుంకం విధిస్తామని, 60 దేశాలపై అదనపు పన్నులు విధిస్తామని తెలిపారు. భారత ఉత్పత్తులపై అమెరికా పరస్పర సుంకాలు విధించడం వల్ల వ్యవసాయం, ఫార్మా, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రికల్, మెషినరీ సహా పలు కీలక రంగాల వస్తువులపై ప్రభావం పడనుంది.

ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాలపై తాము సగమే విధిస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. అమెరికా భవిష్యత్తు అమెరికా చేతుల్లోనే ఉందన్నారు. జాలితోనే సగం సుంకం విధిస్తున్నట్టుగా వెల్లడించారు. భారత్ గ...