భారతదేశం, ఏప్రిల్ 9 -- Trump tariffs: ఔషధాల దిగుమతులపై 'భారీ' కొత్త సుంకాన్ని అమలు చేయడానికి అమెరికా సన్నాహాలు చేస్తోందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వెల్లడించారు. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, ఔషధ తయారీదారులు తమ కార్యకలాపాలను తిరిగి అమెరికా గడ్డపైకి తీసుకురావడానికి ప్రోత్సహించడానికి ఈ కొత్త టారిఫ్ లు దోహదపడుతాయని అన్నారు.

''త్వరలోనే ఫార్మాస్యూటికల్స్ పై భారీ సుంకాన్ని ప్రకటించబోతున్నాం. అది వినగానే ఫార్మా కంపెనీల వారు చైనాను విడిచి వెళ్లిపోతారు. ఇతర ప్రాంతాల్లోని వారు కూడా ఆయా దేశాలు విడిచి వెళ్తారు. అమెరికాకు వస్తారు'' అని ట్రంప్ అన్నారు. 'ఫార్మా కంపెనీలు తిరిగి రాబోతున్నాయి. వారంతా తిరిగి మన దేశానికి వస్తున్నారు, ఎందుకంటే వారు అలా రాకపోతే వారు పెద్ద పన్ను చెల్లించాల్సి ఉంటుది" అని ట్ర...