భారతదేశం, సెప్టెంబర్ 26 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల దిగుమతులపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్ లేదా పేటెంట్ పొందిన ఔషధాలపై 100 శాతం సుంకాన్ని (టారిఫ్) విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం భారతదేశంలోని కీలకమైన ఔషధ తయారీ సంస్థలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది!

"అక్టోబర్ 1, 2025 నుంచి.. ఏ కంపెనీ అయినా అమెరికాలో తమ ఫార్మాస్యూటికల్ తయారీ ప్లాంట్‌ను నిర్మించకపోతే, ఆ కంపెనీకి చెందిన బ్రాండెడ్ లేదా పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిపై 100% టారిఫ్ విధిస్తాం," అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' పోస్ట్‌లో వెల్లడించారు.

'నిర్మించడం' అనే పదానికి నిర్వచనం ఇస్తూ, 'పనులు ప్రారంభించడం' లేదా 'నిర్మాణంలో ఉండడం'గా పరిగణిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

ఫార్మాతో పాటు ఇతర రంగాలపైనా ట్రంప్​ టారీ...