భారతదేశం, ఫిబ్రవరి 14 -- భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకంటే చాలా కఠినమైన సంధానకర్త (negotiator) అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం అనంతరం ట్రంప్ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, యూఎస్ ల మధ్య టారిఫ్ డీల్ పై చర్చలు జరపడంలో మీ ఇద్దరిలో ఎవరు టఫ్ అన్న ప్రశ్నకు ట్రంప్ పై విధంగా సమాధానమిచ్చారు. ''ప్రధాని మోదీ నా కంటే చాలా టఫ్ నెగోషియేటర్. ఇందులో పోటీనే లేదు'' అని ట్రంప్ చిరునవ్వుతో ప్రశంసించారు. టారిఫ్ డీల్ చర్చల సమయంలో మోదీ భారతదేశం కోసం తీవ్రంగా వాదించారన్న ఉద్దేశంతో ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు.

వాణిజ్య సుంకాలపై తమ మధ్య జరిగిన చర్చ గురించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, సుంకాల సడలింపు, యుఎస్ నుంచి మరింత చమురు, గ్యాస్ కొనుగోలు, యుద్ధ విమానాల కొనుగోలు, వాణిజ్య యుద్ధాన్ని నిరోధించే రాయితీల ...