భారతదేశం, ఫిబ్రవరి 7 -- ఓటీటీల హవా పెరిగిపోయాక.. టీవీ ఛానెళ్లలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో కొన్నిసార్లు భారీ చిత్రాలకు కూడా టీఆర్పీ తక్కువగా వస్తోంది. థియేటర్లు, ఓటీటీల్లో చాలా మంది అప్పటికే చూసేయడం లాంటి కారణాలతో కొన్ని బ్లాక్‍బస్టర్ చిత్రాలు కూడా టీవీల్లో సరిగా పర్ఫార్మ్ చేయలేదు. అయితే, తమిళ మూవీ 'అమరన్' తెలుగు వెర్షన్ టీవీల్లో అద్భుతమైన స్పందన దక్కించుకుంది. శివకార్తీకేయన్, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ టీవీల్లో దుమ్మురేపింది. దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' కూడా మంచి రేటింగ్ సాధించింది.

అమరన్ చిత్రం తెలుగులో జనవరి 26వ తేదీన సాయంత్రం స్టార్ మా ఛానెల్‍లో ప్రసారం అయింది. స్ట్రైట్ తెలుగు సినిమా కాకపోవటంతో ఈ చిత్రానికి టీఆర్పీపై అంతగా హైప్ లేదు. తెలుగులో థియేటర్లలో మంచి కలెక్షన్లే దక్కించుకున్నా.. టీవీల్ల...