Hyderabad, ఏప్రిల్ 28 -- Trivikram At Usha Parinayam Set: తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్లలో ఒక‌రు కె. విజ‌య భాస్క‌ర్. ఎన్నో సూపర్ హిట్స్ అందించిన విజయ భాస్కర్ అగ్ర దర్శకుడిగా వెలుగొందారు. ఇప్పుడు మళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు.

నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన విజయ భాస్కర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. విజ‌య భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై కె. విజ‌య భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో ఆయన త‌న‌యుడు శ్రీ‌ క‌మ‌ల్ హీరోగా న‌టిస్తున్నారు.

శ్...