Hyderabad, ఆగస్టు 1 -- Trisha Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. తాజాగా ఆ జానర్ వెబ్ సిరీస్ ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది. త్రిష నటించిన తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. నిజానికి ఆగస్ట్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని చెప్పిన ఈ సిరీస్ ఒక రోజు ముందే ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఈ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

త్రిష నటించిన ఈ వెబ్ సిరీస్ పేరు బృందా. సుమారు మూడేళ్లుగా చిత్రీకరణలో ఉన్న ఈ సిరీస్ మొత్తానికి ఓటీటీలో అడుగుపెట్టింది. చాలా రోజులుగా ఈ సిరీస్ ప్రమోషన్లు నిర్వహిస్తున్న సోనీలివ్ ఓటీటీ.. ఆగస్ట్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెబుతూ వస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా ఒక రోజు ముందే అంటే గురువారం (ఆగస్ట్ 1) సాయంత్రం నుంచే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

త్రిష ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సిరీస్ ఇది. య...