Hyderabad, ఏప్రిల్ 21 -- Trisha: కమల్ హాసన్, త్రిష ప్రస్తుతం తమ నెక్ట్స్ మూవీ థగ్ లైఫ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ఇందులో భాగంగా ఓ ఈవెంట్లో త్రిషపై కమల్ ఓ బూతు జోకు వేయడం గమనార్హం. ఓ వంటకం విషయంలో కమల్ నోరు జారాడు. దీనిపై ప్రస్తుతం నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్, త్రిష, శింబు నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ ముగ్గురూ ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఫేవరెట్ డిష్ గురించి త్రిష మాట్లాడింది. "నాకు అన్నీ ఇష్టమే. కానీ ఉడకబెట్టిన అరటి చాలా ఇష్టం. దాన్నేమంటారు?" అని త్రిష అడిగింది. అప్పుడు పక్కనే ఉన్న కమల్ స్పందిస్తూ.. పళం పూరి అని అన్నాడు. ఆ.. పళం పూరి అంటే నాకు చాలా ఇష్టం అని త్రిష చెప్పింది.

కమల్ అంతటితో ఆగకుండా.. "తనకు దాని పేరు...