Hyderabad, ఏప్రిల్ 17 -- Director Trinadha Rao Nakkina About Chaurya Patam Concept: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారారు. త్రినాథరావు నక్కిన నిర్మాతగా ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టిన సినిమా చౌర్య పాఠం. క్రైమ్ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన చౌర్య పాఠంలో అంతా కొత్తవాళ్లు నటిస్తున్నారు.

చౌర్య పాఠం సినిమాతో నిఖిల్ గొల్లమారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక తాజాగా ఏప్రిల్ 16న చౌర్య పాఠం ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత త్రినాథరావు నక్కిన ఇంట్రెస్టింగ్ విశేషాలు, ప్రొడ్యూసర్ల కష్టాలు అర్థమయ్యాయని చెప్పారు.

నిర్మాత త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. కారణాలు ఏమైనా ఈ మధ్యకాలంలో ఆడియన్స్ థియేటర్స్ రావడం తగ్గింది. ఇలాంటి సమయంలో అంతా కొత్తవారి...