Hyderabad, మార్చి 14 -- నిద్ర సరిపోకపోవడం అనేది బయటకు చెప్పుకోలేని సమస్య. చాలా మంది ఇదే ఇబ్బందితో బాధపడుతుంటారు. బెడ్ మీదకు వెళ్లిన కొద్ది గంటల తర్వాత గానీ, వారికి నిద్రపట్టదు. మీకు కూడా ఈ సమస్య కొన్ని సందర్భాల్లో కలిగి ఉండొచ్చు. ఆ తర్వాత రోజు మీరు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి చూస్తే నిద్ర ఎంత ముఖ్యమో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా కొన్ని రోజుల పాటు నిద్రలేకుండా గడిపితే, దీర్ఘకాలిక నిద్రలేమి మన ఆరోగ్యం, శ్రేయస్సుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే, మీ మనసును ప్రశాంతపరచి మంచి రాత్రి నిద్ర పొందాలి. దీని కోసం ఈ చిట్కాలు, ఉపాయాలు పాటించి చూడండి. ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోవాల్సిందే.

అంకెల లెక్కింపుపై దృష్టి పెట్టడం ద్వారా మీకు నిద్రలేకుండా చేసే ఆలోచనల నుంచి, ఆందోళనల నుంచి మనస్సును దూరంగా ఉంచుకోగలుగుతారని వైద్యులు చెబుతున్నారు. వ...