Hyderabad, మార్చి 22 -- భారతీయ మహిళల అలంకరణలో చీరకుప్రత్యేక స్థానం ఉంది. బనారసి, కాంజీవరం, కాటన్ సారీలు వంటివి ఎల్లప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. షిఫాన్, జార్జెట్, సిల్క్ వంటివి కూడా ఎప్పటికీ రన్నింగ్‌లోనే ఉంటాయి. కానీ ఈ మధ్య ట్రాన్స్‌పరెంట్ చీరలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. చాలా పలుచగా ఉండే ప్లెయిన్ చీరలు, నెట్టెడ్ చీరలు ఈ సీజన్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి.

నిజానికి ట్రాన్స్‌పరెంట్ చీరలు కొత్త ఫ్యాషన్ ఏం కాదు.. ఒకప్పుడు హీరోయిన్లు బాగా వాడిన మోడలే. కానీ మధ్యలో వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే మళ్లీ ఇప్పుడివి వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం సెలబ్రిటీలు, ఫ్యాషన్ లవర్స్ అంతా వీటికే మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవాలి అనుకుంటున్నారా? ట్రాన్స్‌పరెంట్ చీరల్లో తళుక్కున మెరిసిపోవాలి అనుకుంటున్నారా? అయితే దీని స్టైలింగ్‌లో ఏలాంటి చ...