భారతదేశం, ఫిబ్రవరి 15 -- Trains LHB Coaches : ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. శ‌బ‌రి, ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు, తిరుప‌తి-సికింద్రాబాద్ సూప‌ర్ ఫాస్ట్ రైలుకు జ‌ర్మనీకి చెందిన లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ప్రయాణికులకు సౌక‌ర్యవంత‌మైన ప్రయాణాన్ని అందించ‌వ‌చ్చని ఇండియన్ రైల్వే పేర్కొంది.

దేశంలో రైలు ప్రయాణాన్ని ఆధునీకరించే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో భాగంగా శబరి ఎక్స్‌ప్రెస్ (17229/17230) రైళ్లు, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ (12763/12764) రైళ్లు, తిరుపతి-సికింద్రాబాద్-తిరుపతి సూప‌ర్ ఫాస్ట్ (12731/12732) రైళ్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎల్‌హెచ్‌బీ రేక్‌ల‌కు అధికారికంగా ఆమోదం లభించింది. సాంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ నుంచి అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ రేక్‌ల‌కు మార్పు ఏప్రిల్ నుంచి అమలు కా...