భారతదేశం, డిసెంబర్ 6 -- Toyota Innova Hycross vs Kia Carnival : ఆటో మార్కెట్​లో ఇప్పుడు టయోటా ఇన్నోవా హైక్రాస్​ హాట్​ టాపిక్​గా మారింది. ఈ ఎంపీవీని సంస్థ ఎప్పుడెప్పుడు లాంచ్​ చేస్తుందా అని అందరు ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. మార్కెట్​లో ప్రస్తుతం ఉన్న వాహనాలతో టయోటా ఇన్నోవా హైక్రాస్​ను కంపేర్​ చేయాలని కస్టమర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నోవా హైక్రాస్​.. కియా కార్నివాల్​ కార్ల ఫీచర్స్​తో పాటు ఇతర అంశాలు పోల్చి చుద్దాము..

టయోటా ఇన్నోవా హైక్రాస్​తో పోల్చుకుంటే.. ఎత్తు, వెడల్పు, వీల్​బేస్​ విషయంలో కియా కార్నివాల్​ చాలా పెద్దగా ఉంటుంది. ఇన్నోవా హైక్రాస్​ పొడవు 4,755ఎంఎం కాగా.. కియా కార్నివాల్​కి అది 5,115ఎంఎంగా ఉంది. ఇన్నోవా హైక్రాస్​ వెడల్పు 1,850ఎంఎం. కియా కార్నివాల్​ వెడల్పు 1,755ఎంఎం. మరోవైపు ఇన్నోవా హైక్రాస్​ వీల్​ బేస్​ 2,850ఎంఎం. క...