భారతదేశం, ఫిబ్రవరి 18 -- అంతర్జాతీ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో మరో విప్లవం! భారత్​ సహా అనేక దేశాల్లో, వివిధ పేర్లతో బెస్ట్​ సెల్లింగ్​ ఎంపీవీగా కొనసాగుతున్న టయోటా ఇన్నోవాకు "ఈవీ" టచ్​ ఇచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే జకార్తా వేదికగా జరిగిన ఇండోనేషియా ఇంటర్నేషనల్​ మోటార్​ షోలో ఇన్నోవా ఈవీ కాన్సెప్ట్​ వర్షెన్​ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆటో షోలో ప్రదర్శించిన ఇన్నోవా ఈవీ.. సౌత్ ఈస్ట్ ఏషియా మార్కెట్లలో విక్రయించే కియాంగ్ ఇన్నోవా మోడల్ ఆధారంగా రూపొందించినట్టు స్పష్టమవుతోంది. జాపనీస్ ఆటో దిగ్గజం ప్రకారం.. ఈ ఇన్నోవా ఈవీ కాన్సెప్ట్ త్వరలో ప్రాడక్షన్​ స్టేజ్​కి వెళుతుంది. ఆ తర్వాత సేల్స్​ ప్రారంభమవుతాయి.

ఆసియా మార్కెట్లలో టయోటా మోటార్ నుంచి అత్...