భారతదేశం, మార్చి 9 -- టయోటా కిర్లోస్కర్ మోటార్ ఒక విశ్వసనీయ కార్ల తయారీదారు. జనవరిలో అట్టహాసంగా ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కంపెనీ హిలక్స్ పికప్ ట్రక్ బ్లాక్ ఎడిషన్ మోడల్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇదే పికప్ ట్రక్‌ను ఘనంగా విడుదల చేశారు. దీని ధర రూ. 37.90 లక్షలు(ఎక్స్ షోరూమ్) ఈ కొత్త వాహనం ఫీచర్ల గురించి చూద్దాం..

కొత్త టయోటా హిలక్స్ బ్లాక్ ఎడిషన్ పికప్ ట్రక్ ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. రెగ్యులర్ హిలక్స్‌తో పోలిస్తే.. ఇది నలుపు రంగు థీమ్‌ను కలిగి ఉంది. దీని గ్రిల్, అల్లాయ్ వీల్స్, రియర్ వ్యూ మిర్రర్లు, డోర్ హ్యాండిల్స్ కూడా నల్లగా ఉంటాయి. దీంతోపాటుగా ఇది ప్రొజెక్టర్-ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, పాత మోడల్ లాగానే టెయిల్‌గేట్‌పై పెద్ద అక్షరాలతో రాసిన టయోటా పేరు కూడా ఉంటుంది.

కొత్త టయోటా హిలక్స్ బ్లాక్ ఎడి...