Hyderabad, మార్చి 17 -- ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటేనే ఏ వ్యక్తి అయినా ఎక్కువకాలం జీవించగలడు. అతని ఆయుష్షు అతడు తినే ఆహారం, జీవనశైలిపైనే ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఏడు రకాల ఆహారాలు శరీరంలోని అన్ని రకాల విషయాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. అవేంటో ఆయుర్వేదం వివరిస్తుంది. వీటిని ప్రతిరోజు తినేందుకు ప్రయత్నిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇప్పుడు ఎన్నో రకాల కూరగాయలను పురుగుల మందులు, రసాయనాలతో పండిస్తున్నారు. అవి తినడం వల్ల శరీరంలో హానికరమైన విషాలు చేరిపోతున్నాయి. కాబట్టి వాటిని తొలగించుకోవాలంటే మరికొన్ని ఆహారాలను ప్రత్యేకంగా తినాల్సిన అవసరం ఉంది.

ప్రతి ఇంట్లో నెయ్యి ఉంటుంది. ఇది మంచి కొవ్వును కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు, చర్మ ఆరోగ్యానికి, కంటి ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బరువు తగ్గేందుక...