తెలంగాణ,హైదరాబాద్, మార్చి 14 -- ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వివరాలను పేర్కొంది. ఏప్రిల్/మే సెషన్ కు సంబంధించిన పరీక్షలు. ఏప్రిల్ 20వ తేదీతో ప్రారంభమవుతాయని తెలిపింది. ఏప్రిల్ 26వ తేదీతో ఈ ఎగ్జామ్స్ ముగుస్తాయని పేర్కొంది. త్వరలోనే హాల్ టికెట్లను అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.

థియరీ పరీక్షలు రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని ప్రకటలో పేర్కొన్నారు. ఇక ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26వ తేదీన ప్రారంభమవుతాయి. మే 3వ తేదీతో అన్ని పరీక్షలు ముగుస్తాయి. కింద ఇచ్చిన పీడీఎఫ్ లో పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను చూడొచ్చు..

Published by HT Digital C...