భారతదేశం, మార్చి 5 -- భారత్‌ అతిపెద్ద కార్ల మార్కెట్‌ను కలిగి ఉంది. ఫిబ్రవరి 2025 సంవత్సరానికి సంబంధించి కార్ల కంపెనీలు.. తమ అమ్మకాల గణాంకాలను ప్రచురించాయి. మారుతి సుజుకికి ఈ కాలంలో తోపుగా నిలిచింది. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో కంపెనీకి చెందిన 7 కార్లు చోటు దక్కించుకున్నాయి. ఇందులో టాటా నుండి రెండు కార్లు, హ్యుందాయ్ నుండి ఒక కార్ కూడా ఉన్నాయి.

గత నెల (ఫిబ్రవరి - 2025) మారుతి సుజుకి ఫ్రాంక్ ఎస్‌యూవీ 21,461 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్(19,879 యూనిట్లు), మూడవ స్థానంలో హ్యుందాయ్ క్రెటా (16,317 యూనిట్లు), నాల్గో స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ (16,269 యూనిట్లు), ఐదో స్థానంలో మారుతి సుజుకి బాలెనో (15,480 యూనిట్లు) ఉన్నాయి.

ఆరో స్థానంలో మారుతి సుజుకి బ్రెజ్జా(15,39...