HYderabad, మార్చి 25 -- మనందరికీ తెలిసిన విషయమేమిటంటే, టమాటో తింటే శరీరానికి రక్తం పడుతుందని. దీనిలో ఏం లాజిక్కుందో తెలియదు. కానీ, పెద్దోళ్లంతా ఇదే మాట చెప్పి మనతో తినిపించారు. ఇప్పుడు మనం కూడా అదే చెప్పి పిల్లలకు పెడదామా.. వాస్తవాలేంటో తెలుసుకుని తినిపిస్తే అదెంత ముఖ్యమో అర్థమవుతుంది కదా. అందుకే టమాటో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మీ ముందుంచుతున్నాం.

యాంటీ ఆక్సిడెంట్లు: టమాటోలలో లైకెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలు దెబ్బతినకుండా నివారిస్తుంది. కాబట్టి టమోటాలను క్రమం తప్పకుండా తినడం వల్ల ఒత్తిడి సంబంధిత డ్యామేజ్ రిస్క్ తగ్గుతుంది.

రక్తపోటు నియంత్రణ: టమాటోల్లో ఉండే పొటాషియం మినరల్ కాంపోనెంట్ గుండెకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది అధిక ఒత్తిడిని నిర్వహిస్తుంది. అధిక రక్తపోటు సమస్యలు ఉ...