Hyderabad, ఫిబ్రవరి 1 -- సలాడ్ తీసుకునే చాలా మంది చేసే పొరబాటు ఏంటంటే, చలువదనానికి దోసకాయ, రుచికోసం టమాటా చిన్న ముక్కలుగా చేసుకుని వాడటం. కానీ, ఇలా చేయడం అనేది ఆరోగ్యానికి చేటు చేస్తుందట. సలాడ్ ఫైబర్‌ కోసం కీరదోసను జతచేస్తాం. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అంతేకాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. అయితే, ఆయుర్వేదం సూచిస్తున్న ఆహార నియమాల ప్రకారం.. సలాడ్ లోనైనా, మరెందులోనైనా టమాటా, కీరదోసను కలిపి తినకూడదట. ఒకవేళ తింటే ప్రధానంగా మూడు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట.

ఆయుర్వేదం ప్రకారం, కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల శరీర సమతుల్యత దెబ్బతిని, జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన కాంబినేషన్ టమాటో + కీరదోస. ఈ రెండు కూరగాయలు విరుద్ధ ఆహారాల జాబితాలో ఉన్నాయి. వేర్వేరు సమయాల్లో జీర్ణమవుతాయి. ...